DY Chandrachud: తానూ రాజకీయాల్లోకి వస్తాను అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించారు మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్. 65 ఏళ్ల వయసు తరువాత ఏ పనీ చేయనని చెప్పారు. రాజకీయాల్లోకి రావడం అంటే అది తన పనిని, న్యాయ వ్యవస్థ సమగ్రతను అనుమానిస్తుందని ఆయన చెప్పారు. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావాలా? అని మీడియా నుంచి వచ్చిన ప్రశ్నపై దీనిపై ఆయన స్పందిస్తూ- ఈ విషయంలో రాజ్యాంగంలో కానీ, చట్టంలో కానీ ఎలాంటి ఆంక్షలు లేవు. మన సమాజం మాజీ న్యాయమూర్తులను న్యాయ సంరక్షకులుగా చూస్తుంది. వారి జీవన విధానం సమాజంలోని న్యాయ వ్యవస్థకు అనుగుణంగా ఉండాలి అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Jharkhand: జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి రెడీ
DY Chandrachud: ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన స్పందించారు. ట్రోలింగ్ విషయంలో న్యాయమూర్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కోర్టు నిర్ణయాలను మార్చేందుకు ట్రోలర్లు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో, చట్టాల చెల్లుబాటును నిర్ణయించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానానికి అప్పగించారని, దానిని కాపాడాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు.