Shafali Verma: వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ షెఫాలి వర్మపై వేటుపడింది. కంగారు గడ్డపై ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత మహిళల జట్టులో షెఫాలీకి చోటు దక్కలేదు. ఈ ఏడాది 6 వన్డే మ్యాచ్లడిన షెఫాలి 108 పరుగులు మాత్రమే రాబట్టింది. పేలవమైన ఫామ్ కారణంగా నిరుడు డిసెంబరులో సొంతగడ్డపై ఆసీస్ సిరీస్ మధ్యలో నుంచి షెఫాలిని తప్పించారు. ఈ ఏడాది జూన్లో దక్షిణాఫ్రికాతో సిరీస్లో షెఫాలీ పునరాగమనం చేసింది. ఉమా ఛెత్రి, దయాలన్ హేమలత, శ్రేయాంక పాటిల్, సయాలి సతఘరేలకు కూడా జట్టులో స్థానం లభించలేదు. డిసెంబరు 5, 8, 11న వరుసగా మూడు వన్డేలు జరుగుతాయి.
Shafali Verma: భారత వన్డే జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తిశర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధ యాదవ్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, సైమా ఠాకూర్