Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో దర్శనాలు ఒకటి. ఇక నుంచి వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శనం కోసం తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. సర్వదర్శనంతో పాటు అన్ని దర్శనాల సమయం తగ్గించడానికి టెక్నాలజీ సాయం తీసుకుంటామనే నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం సామన్యులతో పాటు అందరూ వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, యాత్రికులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి సహాయపడుతుంది.
సుదీర్ఘ నిరీక్షణ సమయం గురించి పెరుగుతున్న ఆందోళన మధ్య TTD సర్వదర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 2-3 గంటల్లో వారి దర్శనం (శ్రీవారి దర్శనం) కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ప్రకటించింది.