Hrithik Roshan: బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ అంటే పడిచచ్చిపోయే కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. అయితే అభిమానుల ప్రేమనే కాదు… ఆగ్రహాన్ని తట్టుకోవడం కూడా ఒక్కోసారి స్టార్ హీరోలకు కష్టమౌతుంటుంది. దానికి తాజా ఉదాహరణగా హృతిక్ ఫ్యాన్స్ నే తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హృతిక్ రోషన్ సినిమాలు బాగా తగ్గించేశాడు. గడిచిన ఏడు సంవత్సరాల్లో హృతిక్ కేవలం నాలుగు సినిమాలే చేశాడు. దాంతో ఆగ్రహించిన అభిమానులు… చేస్తే మరిన్ని సినిమాలు చేయండి.. లేదంటే చిత్రసీమ నుండి వైదొలగండి అని విన్నవించుకుంటున్నారు. అంతేకాదు… ‘సైన్ మోర్ ఫిలిమ్స్ ఆర్ రిటర్న్ హృతిక్’ అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ ఎన్టీఆర్ తో కలిసి ‘వార్ -2’లో నటిస్తున్నాడు.

