ATP Finals 2024: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సినర్ వరుసగా రెండో ఏడాది ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో పైనల్ చేరుకున్నాడు. నార్వేకు చెందిన ఆరోసీడ్ రూడ్ తో జరిగిన సెమీస్‌లో ఈ టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు 6-1, 6-2 తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో సినర్ 9 ఏస్ లు సంధించాడు. తొలి సెట్లో ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన అతను, రెండో సెట్లోనూ దూకుడు కొనసాగించి గేమ్ తో పాటు మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఫ్రిట్జ్‌తో ఫైనల్లో తలపడనున్ను సినర్ గతేడాది ఏటీపీ ఫైనల్స్ తుదిపోరులో జొకోవిచ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
