Delhi: రాజ్యసభలో కీలక పరిణామం జరిగింది. నోట్ల కట్టలు బయటపడ్డాయి.రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, సీటు నంబర్ 222 వద్ద పెద్ద మొత్తంలో నగదు, ముఖ్యంగా రూ.500 నోట్లతో కూడిన కట్టలను భద్రతా సిబ్బంది పట్టుకున్నట్లు చెప్పారు. ఆ సీటు తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీదని తెలిపారు.ఈ ఘటనపై విచారణ జరిపించాలని ధన్‌ఖర్ ఆదేశించారు.
అభిషేక్ సింఘ్వీ పేరు ప్రస్తావించడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మల్లికార్జున ఖర్గే ఈ అంశంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.ఎగువ సభలో భారీ నగదు పట్టుబడటం వలన రాజకీయ వాతావరణంలో ఒక పెద్ద సంచలనం కలిగింది.