The Gentleman: తెలుగులో మెగాస్టార్ గా సాగుతున్న చిరంజీవి అప్పట్లో మూడు హిందీ చిత్రాల్లో హీరోగా నటించి అలరించారు. ‘ప్రతిబంధ్, ఆజ్ కా గూండా రాజ్’ సినిమాలతో ఉత్తరాదిన చిరంజీవికి మంచి పేరు లభించింది. దాంతో తమిళంలో విజయం సాధించిన ‘జెంటిల్ మేన్’ సినిమాను హిందీలో చిరంజీవి హీరోగా ‘ద జెంటిల్ మేన్’ పేరుతో రూపొందించారు. మహేశ్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘ద జెంటిల్ మేన్’ 1994 నవంబర్ 18న విడుదలయింది. చిరంజీవి సరసన జుహీ చావ్లా నాయికగా నటించిన ఈ చిత్రానికి అనూ మాలిక్ స్వరకల్పన చేశారు. ఒరిజినల్ ‘జెంటిల్ మేన్’లోని ఎ.ఆర్.రహమాన్ ట్యూన్స్ లో మూడింటిని అనుకరించారు. ‘ద జెంటిల్ మేన్’ అంతకు ముందు చిరంజీవి నటించిన హిందీ చిత్రాల స్థాయిలో కాకపోయినా బాగానే అలరించింది.
