Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఇప్పటి వరకు 260 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డీపీఈవో సీహెచ్ తిరుపతినాయుడు తెలిపారు.ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళంసర్కిల్లో32 దుకాణాలకు గాను74, ఆమదాలవలస13 దుకాణాలకు18,రణస్థలం15కి 66,పొందూరు10కి 18, నరసన్నపేట12కి 10,కొత్తూరు 7కి13,పాతపట్నంలో8కి 2,కోటబొమ్మాళి15కి 11, పలాస15కి 32,సోంపేట12కి 12,ఇచ్ఛాపురంలో 8దుకాణాలకు12దరఖాస్తులు వచ్చాయన్నారు.దరఖాస్తులుసమర్పించే సమయంలో అభ్యర్థి లేకపోతే అతడి తరఫున ధృవీకరణపత్రం జతచేయాలని స్పష్టం చేశారు.దుకాణం సొంత చేసుకున్నసందర్భంలో కూడా అభ్యర్థి లేనిపక్షంలో అతడి ధృవీకరణ పత్రంసమర్పించాలన్నారు. మరో రెండు రోజులే గడువు ఉన్నందున ఆశా వాహులు ఆశలు మిన్నంటుతున్నాయి.

