Ranthambore National Park: రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లోని 75 పులులలో 25 పులులు అదృశ్యమయ్యాయి. ఏడాది కాలంగా ఇలా జరుగుతోందని రాజస్థాన్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పవన్ కుమార్ ఉపాధ్యాయ్ పార్క్ అధికారులకు తెలిపారు. అంతకుముందు, జనవరి 2019- జనవరి 2022 మధ్య రణథంబోర్ నేషనల్ పార్క్ నుండి 13 పులులు తప్పిపోయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి.
అదృశ్యమైన పులులపై దర్యాప్తు చేసేందుకు వన్యప్రాణి విభాగం సోమవారం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పర్యవేక్షణ రికార్డులను పరిశీలిస్తుంది. ఉద్యానవన అధికారుల వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగితే చర్యను రికమండ్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: Jet Airways: చరిత్రగా మారిన జెట్ ఎయిర్ వేస్.. కోర్టు తీర్పుతో ముగిసిన కథ
Ranthambore National Park: మే 17 నుంచి సెప్టెంబరు 30 మధ్య తప్పిపోయిన 14 పులులపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించామని, ఇంకా ఎలాంటి జాడ లభించలేదని అధికారులు తెలిపారు. రెండు నెలల్లో కమిటీ తన నివేదికను సమర్పించనుంది. పర్యవేక్షణలో కొన్ని లోపాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ట్రాప్ కెమెరాల్లో పులులు కనిపించకపోవడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
ఏడాది వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో పులులు తప్పిపోయినట్లు అధికారికంగా వెల్లడి కావడం ఇదే తొలిసారి. నవంబర్ 4న ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం.. రణతంబోర్ పర్యవేక్షణ అంచనాలలో పులులు తప్పిపోయిన సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.
పార్కులో పులులు ఎక్కువగా ఉండడం వల్లే వివాదం తలెత్తిందని పార్క్ అధికారులు చెబుతున్నారు. ఇందులో పులి పిల్లలు కూడా ఉన్నాయి. పార్క్ 900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ పులులకు వసతి కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.