Apthudu: యాంగ్రీ మేన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో జీవిత రాజశేఖర్ నిర్మించిన చిత్రం ‘ఆప్తుడు’… హిందీలో రాజ్ కుమార్ సంతోషి రూపొందించిన సన్నీడియోల్ మూవీ ‘ఘాతక్’ ఆధారంగా ‘ఆప్తుడు’ తెరకెక్కింది… 2004 అక్టోబర్ 23న ‘ఆప్తుడు’ చిత్రం విడుదలయింది. అంజలా ఝవేరి నాయికగా నటించిన ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం సమకూర్చారు… ‘ఘాతక్’ కథను తీసుకున్నా దానిని తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా మార్చారు… ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు రాశారు… సమాజాన్ని పట్టి పీడించే దుష్టశక్తులకు ఎదురు నిలుస్తాడు బోస్. దాంతో వారి ఆకృత్యాలలో బోస్ తాను ప్రేమించేవారందరినీ పోగొట్టుకుంటాడు… అయినా తన చుట్టూ ఉన్న వారికోసం బోస్ పాటుపడి చివరకు ఆ దుష్టశక్తులను అంతమొందిస్తాడు. దాంతో జనం బోస్ ను తమ ‘ఆప్తుడు’గా భావించడంతో కథ ముగుస్తుంది. సత్యనారాయణ, ముకేశ్ ఋషి, చంద్రమోహన్, సునీల్, చలపతిరావు, రాళ్ళపల్లి, కృష్ణభగవాన్ తదితరులు నటించారు. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. రాజశేఖర్ మాత్రం తనదైన నటనతో అలరించారు.
