Cow Illegal Transport: అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ను అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో ని 44వ నంబర్ జాతీయ రహదారిపై పామిడి-గుత్తి హైవేపై ఉన్న కాశేపల్లి టోల్గేట్ వద్ద అక్రమంగా తరలివెళ్తున్న గోవుల కంటైనర్ను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల జిల్లా డోన్ నుంచి కేరళకు ఓ కంటైనర్లో గోవుల అక్రమ తరలింపు చేపట్టారు. ఈసమాచారం అందుకున్న పెద్దవడుగూరు పోలీసులు కంటైనర్ అక్కడ ఆపారు.
ఇది కూడా చదవండి: Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
Cow Illegal Transport: కంటైనర్ లో గోవులు అక్రమంగా తరలివెళ్తుండడడాన్ని వారు గుర్తించారు.గోవుల కంటైనర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కంటైనర్ లో నుంచి గోవులను కిందికి దించి స్టేషన్ ఆవరణలో వదిలేశారు. ఈ సమాచారం అందుకున్న బీజేపీ జిల్లా నాయకుడు. పామిడివాసి రాజా పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్రమ గోవుల తరలింపుపై పోలీసులతో మాట్లాడి,అక్రమార్కులపై చట్టరీత్యా చర్యలు చేపట్టి మూగజీవుల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు.