Road Accident: గుజరాత్‌లోని అంబాజీకి వెళ్తున్న ఓ లగ్జరీ బస్సు, కారుతో సహా మరో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లగ్జరీ బస్సు రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇదే ప్రమాదంలో కారు కూడా రోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను రక్షించారు. అనంతరం వారిని తండా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: దారుణం.. కుక్కపిల్లపై పెట్రోల్ పోసి చంపిన మహిళలు
Road Accident: ఆసుపత్రి డాక్టర్ కె.కె. సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన 38 మందిలో 6 మంది పరిస్థితి విషమంగా ఉంది. . వారిని చికిత్స నిమిత్తం పాలమూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.