Delhi Shocker: ఢిల్లీలోని డీర్ పార్క్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పార్క్‌లోని ఓ చెట్టుకు ఉరివేసుకుని యువకుడు, యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పార్క్‌లో విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా పోలీసులు గుర్తించారు. డీర్ పార్క్ సెక్యూరిటీ గార్డు బాల్‌జీత్ సింగ్ ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: గొప్ప నాయకులను గౌరవించడం అవసరం.. యూపీ సీఎం ఆదిత్యనాథ్
ఆత్మహత్యకు పాల్పడింది 18 ఏళ్ల యువకుడు, 17 ఏళ్ల యువతి అని గుర్తించారు. యువకుడు తెలుపు రంగు టీ-షర్ట్, నీలి జీన్స్ ధరించి ఉండగా, యువతి గులాబీ రంగు దుస్తులు ధరించి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఒకే తాడుతో ఉరివేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించి, ఫోరెన్సిక్ టీమ్‌ను పిలిపించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారిస్తున్నారు.