YSRCP: కర్నూల్లోని 9, 12వ వార్డులకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ సమక్షంలో టిడిపి పార్టీలో చేరారు. 9వ వార్డు కార్పొరేటర్ పుల్లమ్మ, 12వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ అన్నెపోగు క్రాంతి కుమార్లకు మంత్రి టిజి భరత్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతోనే వైసీపీని వీడి కార్పొరేటర్లు తమ పార్టీలోకి వస్తున్నట్లు చెప్పారు. కేవలం తనకు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వైసీపీ నేతలు కర్నూలు అభివృద్దిని అడ్డుకుంటున్నారన్నారు.

