YS Raja Reddy

YS Raja Reddy: రాజకీయాల్లోకి వైఎస్ రాజారెడ్డి.? కుమారుడిని తీసుకొని ఉల్లి మార్కెట్ కు వెళ్లిన షర్మిల.

YS Raja Reddy: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు వైఎస్ షర్మిల గట్టి ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వైఎస్ షర్మిల తన కుమారుడిని తీసుకొని కర్నూలులోని ఉల్లి మార్కెట్ సందర్శన చేశారు. రైతుల నుంచి ఉల్లి ధర, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత షర్మిల, రాజారెడ్డి కలిసి మార్కెట్‌కు వెళ్లడం. ఇవ్వని చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయ అరంగ్రేటానికి సన్నాహాలు చేస్తోందని  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Donald Trump: భారత్ పై మరిన్ని సుంకాలు: ట్రంప్ మరో బిగ్ షాక్

వైఎస్ రాజారెడ్డి గత సంవత్సరం విదేశాల్లో బైబిల్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తండ్రి అడుగుజాడల్లో  క్రైస్తవ సమావేశాల్లో ప్రసంగించిన వీడియోలు సృష్టమైనప్పటికీ, రాజకీయ రంగంలో తన భవిష్యత్ కోసం తను దృష్టి సారించాలనుకున్నాడు. వైఎస్ షర్మిల కూడా తన కుమారుడికి క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్ధితులను అర్థం చేసుకునేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇంతకుముందు బ్రదర్ అనిల్ కుమార్ కూడా బయటగా కనిపించకపోయినా, ఆయన కూడా కుటుంబం రాజకీయ వారసత్వానికి మద్దతుగా తెర వెనుక కృషి చేస్తున్నారనే విశ్లేషణ ఉంది. షర్మిల తన కుమారుడిని రాజకీయ రంగంలో ప్రతిష్టాత్మక స్థానానికి తీసుకెళ్ళేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

వీటన్నిటినీ కలిపి, వైఎస్ రాజారెడ్డి రాజకీయ అరంగ్రహానికి సిద్దమవుతున్నట్టే ఉంది. రైతుల సమస్యలపై ప్రత్యక్షంగా అవగాహన పొందడం, మార్కెట్ పర్యటనల ద్వారా రాజకీయ పరిజ్ఞానం పొందడం మొదలైనవి, ఆయన భవిష్యత్ రాజకీయ వ్యూహానికి దారితీస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *