Yuvakulu Galanthu

Yuvakulu Galanthu: యువకుల మృతదేహాలు లభ్యం..

Yuvakulu Galanthu: సీలేరు నదిలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు శబరినదిలో లభ్యమయ్యాయి. ఈ నెల 20న ఆరుగురు స్నేహితులు కలిసి సరదాగా గడిపేందుకు సీలేరు నదికి వెళ్లారు. వీరంతా స్నానాలకు దిగగా.. వీరిలో సుగ్రియ శ్రీను, నాగుల దిలీప్ కుమార్‌కు కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

వీరి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టింది. సీలేరు నుంచి శబరినదిలోకి ఇద్దరు మృతదేహాలు కొట్టుకొచ్చాయన్న సమాచారంతో పోలీసులు, జాతీయ విపత్తు సహాయక బృందం అప్రమత్తం అయ్యారు.దీంతో వారు ఆ ప్రాంతానికి వెళ్లి గాలించారు.

Also Read: Hyd: చేపల కూర కోసం హత్య చేసిన స్నేహితులు..

Yuvakulu Galanthu: శబరి నదిలో కొట్టుకు వస్తున్న మృతదేహాలను పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. తహసీల్దార్ చిరంజీవి, ఎస్‌ఐ రమేష్‌ సంఘటనా స్థలంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. యువకుల మృతదేహాలను నదిలో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత మృతుల కుటుంబీల రోదనలు ఆ ప్రాంతమంతా మిన్నంటాయి. చేతికి ఎదిగొచ్చిన పిల్లలు మృత్యువాత పడడంతో దుఖసాగరంలో మునిగిపోయారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *