YCP Party: భారతదేశ రాజకీయాల్లో కొన్ని పార్టీలు అధికారం కోల్పోయిన తర్వాత వాటి మనగడే కష్టమనే విధంగా పార్టీలు గ్రాఫ్ దారుణంగా పడితాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ రాజకీయ పరిస్థితి మనందరికీ తెలిసిందే… ఇక ఏపీలో వైసీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది… వైసీపీ గడ్డుకాలం ఎదుర్కొంటుదని చెప్పవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళుతుంది.
YCP Party: సీఎం చంద్రబాబు నేతృత్వంలో పరిశ్రమల దగ్గర నుంచి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రజా ప్రతినిధులను అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుండడంతో ఆ అభివృద్ధిని చూసి వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మండల నాయకులు గ్రామ కేడర్ వరకు వైసీపీని వీడడానికే మెుగ్గు చూపుతున్నారట… ఇక రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉన్న చోటు కూడా పార్టీ ఖాళీ అవుతుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్ లో మళ్ళీ దాడులు.. విపక్షాల విమర్శలు
YCP Party: అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీలోని ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విడపనకల్లు జడ్పీటీసీ సభ్యుడు హనుమంతు, మండల అధ్యక్షుడు బసన్న, వజ్రకరూరు జడ్పీటీసీ సభ్యురాలు తేజస్విని, ఆమె భర్త వసికేరి రమేష్,కూడేరు జడ్పీటీసీ సభ్యురాలు అశ్విని, ఆమె భర్త తుప్పటి హరీష్, బెలుగుప్ప మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు పెద్దన్న టీడీపీ కండువా కప్పుకున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలలోనే జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ వైపు ఆకర్షితులైనట్లు పార్టీలో చేరిన నేతలు చెబుతున్నారు.
YCP Party: ప్రత్యేకించి ఉరవకొండ నియోజకవర్గంను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో పయ్యావుల నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకుని వైసీపీని వీడుతున్నట్లు వివరించారు. నియోజకవర్గాన్ని అందరి సహకారంతో సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్బంగా మంత్రి పిలుపు నిచ్చారు. గత ఐదేళ్లు వైసీపీ అరాచక పాలన చూసిన తరువాత… కూటమి పాలనను ప్రజలు భేరేజీ వేసుకుంటున్నారు. ఆరు నెలలలోనే రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేస్తుందని మంత్రి వివరించారు. విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ భవిష్యత్తులో అభివృద్ధి వైపు దూసుకుపోతుందని పయ్యావుల కేశవ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: AVS Special: యస్… అవి ఏవీయస్ నవ్వులు!
YCP Party: ఉరవకొండలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలినట్టే అని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి చవి చూశారు.ఆరు నెలలు కూడా తిరగకముందే ఆ పార్టీకి మండల నాయకులు గుడ్ బై చెప్పి… టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ నాయకులకు మైండ్ బ్లాంక్ అయిందంట…గత కొన్ని సంవత్సరాలుగా ఉరవకొండలో వైసీపీ అంతర్గత కుమ్మలాట అందరికీ తెలిసిన విషయమే… ఇప్పుడు వాటికి తోడు వివిధ మండలాల్లో నాయకులు వైసీపీని వీడడంతో ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ఎందుకంటే గ్రౌండ్ లెవల్‌లో ఉన్న క్యాడర్ పార్టీలకు బలం… అధికార పార్టీ టీడీపీని ఎదుర్కోవాలంటే పోరాటం చేసే నాయకులు ఉండాలి. అయితే వాటికి భిన్నంగా ఉరవకొండలో వైసీపీ ఖాళీ అవడంతో… ఇప్పుడు ఆ పార్టీలో గందరగోళం నెలకుంది.
YCP Party: ఏపీలో కూటమి దూకుడుకు వైసీపీ కకావికలం అవుతుందట… సీఎం జెట్ స్పీడ్‌తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే… వాటికి ఆకర్షితులు అవుతూ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుంది. ఉరవకొండ వైసీపీ క్యాడర్‌ను కాపాడుకోవడానికి అధిష్టానం ఆపసోపాలు పడుతుంది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు… మండల నాయకులు ఫ్యాన్‌ను వదిలేసి… సైకిల్‌ని ఎక్కడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూడాలి… ఉరవకొండలో వైసీపీ రాజకీయంగా పుంజుకుంటుందా లేదా మరింత బలహీన పడుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.
రచయిత:
మల్లిబోయిన రామాంజనేయులు
సీనియర్ కరస్పాండెంట్
ఉమ్మడి అనంతపురం జిల్లా..