Yashasvi Jaiswal: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడు సిక్స్ లు బాదడం ద్వారా జైస్వాల్ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 30 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ 33 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్ 19 ఇన్నింగ్స్‌ల్లో 1084 పరుగులు చేశాడు. ఈ క్రమంలో స్వదేశంలోనే వెయ్యికి పైగా పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. అతడికంటే ముందు 1979 కేలండర్ ఇయర్ లో గుండప్ప విశ్వనాథ్ , సునీల్ గవాస్కర్ మాత్రమే స్వదేశంలో 1000+కి పైగా పరుగులు సాధించారు.

