Qinwen Zheng: పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, చైనా టెన్నిస్ స్టార్ కిన్‌వెన్ జెంగ్ ఒకే విజయంతో రెండు లక్ష్యాలు సాధించింది. అమెరికాకు చెందిన 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ తో జరిగిన టొరే పాన్ పసిఫిక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీ ఫైనల్లో కిన్‌వెన్ జెంగ్ 7–6 (7/5), 6–3 స్కోరుతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచ ఏడో ర్యాంకర్ కిన్‌వెన్ కెరీర్‌లో ఐదో సింగిల్స్ టైటిల్ సాధించడంతోపాటు సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత పొందింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన కిన్ వెన్ కు రూ. 1 కోటీ 19 లక్షలు ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
