ఏపీలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బందర్ కాలువలో దూకింది. ఘటనను గమనించిన స్థానికులు కాలువలోకి దూకి సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి తీశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండా మృతి చెందింది.
ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవర్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి కుమారుడు కోసం వెతుకుతున్నమని తెలిపారు. ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.