IIM Calcutta: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో తాజాగా ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం).. కోల్‌కతాలో చదువుతున్న విద్యార్థిని పైనే, అదే కళాశాలలోని మరో విద్యార్థి అత్యాచారం చేశాడనే ఆరోపణలు నమోదయ్యాయి.
ఏం జరిగింది..?
శుక్రవారం రోజు ఈ సంఘటన జరిగింది. బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, “కౌన్సెలింగ్ కోసం బాయ్స్ హాస్టల్‌కు రమ్మన్నారు. అక్కడ నాకొక కూల్‌డ్రింగ్ ఇచ్చారు. అది తాగిన తర్వాత స్పృహ కోల్పోయాను. మళ్లీ స్పృహలోకి వచ్చిన తర్వాత నా మీద అత్యాచారం జరిగిందని గ్రహించాను. ఈ విషయం నన్ను ఎవరికి చెప్పొద్దని నిందితుడు బెదిరించాడు కూడా” అని తెలిపింది.
ఇది కూడా చదవండి: MGM Warangal: చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి బతికే ఉన్నాడు! వరంగల్ ఎంజీఎంలో ట్విస్ట్
తక్షణమే అరెస్టు
బాధితురాలి ఫిర్యాదు మేరకు హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కొద్ది గంటల్లోనే నిందిత విద్యార్థిని అరెస్టు చేశారు. మొదటగా అతన్ని కళాశాల యాజమాన్యం డిటేన్ చేసి పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
ఇటీవలి ఘటనలతో కలకలం
ఇదివరకు కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్‌లో ఓ విద్యార్థిని హత్యచేసిన ఘటన, అలాగే లా కాలేజ్‌లో విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఆరోపణలు కలకలం రేపాయి. ఇప్పుడు ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో జరిగిన ఈ ఘటనతో కోల్‌కతా విద్యాసంస్థల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.