Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో మళ్లీ జోరు చూపించేందుకు సిద్ధమైంది. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ, ‘ది ఫ్యామిలీ స్టార్’ నిరాశతో కాస్త వెనక్కి తగ్గినా, ఇప్పుడు అడివి శేష్‌తో ‘డెకాయిట్’తో రీఎంట్రీ ఇస్తోంది. లవ్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌తోనే అంచనాలు పెంచింది.
Also Read: Akhanda 2: బాలయ్య అఖండ 2: రిలీజ్ డేట్ మిస్టరీ.. క్లారిటీ ఎప్పుడు?
Mrunal Thakur: శేష్ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమైనవి. ‘గూఢచారి 2’తో బిజీగా ఉన్నా, ‘డెకాయిట్’తో మృణాల్తో జోడీ కట్టాడు. ఈ సినిమాపై మృణాల్ ఆశలు పెట్టుకుంది. హిట్ అయితే టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. కథల ఎంపికలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకునే మృణాల్, హీరోయిన్గా ఇంపాక్ట్ చూపించే పాత్రలే ఎంచుకుంటుంది. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ అభిమానులను ఆకర్షిస్తోంది. ‘డెకాయిట్’తో మృణాల్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌పై దూసుకెళ్తుందా? వేచి చూడాలి!

