Murder: సమాజంలో రోజురోజుకీ హత్యకాండలు పెరిగిపోతున్నాయి.. మనిషిని మనిషి చంపుకోవటమే దారుణం.. అలాంటిది తమ ఆత్మీయులను, కుటుంబ సభ్యులను దారుణంగా కడతేర్చుతున్నారు. మనిషి మృగంలా మారిపోయి ఇష్టారీతిన నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా భాగ్యనగరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిరిధిలోని క్రిస్టల్ టౌన్‌లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మసీఉద్దీన్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా రెండో భార్య షబానా, అతని కొడుకు సమీర్ హతమార్చారు. కాళ్లు, చేతులు కట్టేసి చాకుతో గొంతు కోసి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు.
Also Read: Eluru: ప్రేమ జంటపై యువతి పేరెంట్స్ దాడి..
Murder: ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా హతుడు మసీఉద్దీన్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. అయితే కుటుంబంలో కలహాలే హత్యకు దారి తీశాయనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.