Hit 3

Hit 3: ‘హిట్ 3’లో విశ్వక్ సేన్ మిస్సింగ్ ఎందుకంటే?

Hit 3: ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాలో విశ్వక్ సేన్ కీలక పాత్రలో కనిపించాల్సి ఉందని, అతను ‘హిట్: ది ఫస్ట్ కేస్’లో నటించిన పాత్రలోనే ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేశారు. ‘హిట్ 2’లో నటించిన అడవి శేష్ కూడా ఈ సినిమాలో కనిపించగా, ఆయన ఎంట్రీ సమయంలో థియేటర్లలో అభిమానుల కేకలు మారుమోగాయి.

Also Read: AI in Telugu Cinema: స్క్రిప్ట్ ఉంటే చాలు సినిమా పూర్తవుతుంది..దిల్‌ రాజు ‘ఏఐ’ స్టూడియో ప్రారంభం

Hit 3: అడవి శేష్ ఎంట్రీకి కొద్ది క్షణాల ముందు విశ్వక్ సేన్ ఎంట్రీ కూడా ఉండాల్సి ఉంది. అయితే, షెడ్యూల్ ఫిక్స్ అయినా విశ్వక్ షూట్‌కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కథలో స్వల్ప మార్పులు చేసి, ఆ సన్నివేశాన్ని తొలగించినట్లు సమాచారం. ఒకవేళ విశ్వక్ నటించి ఉంటే, ‘లైలా’ లాంటి విఫలమైన సినిమా తర్వాత ఆయన కెరీర్‌కు ఈ మాస్ గెస్ట్ రోల్ పెద్ద బూస్ట్ ఇచ్చి ఉండేదని టాక్. ఈ మిస్డ్ ఛాన్స్ విశ్వక్ అభిమానులను నిరాశపరిచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *