Kim Kardashian: అమెరికన్ సోషల్ మీడియా స్టార్, బిజినెస్ వుమెన్ కిమ్ కర్దాషియన్ తన విడాకులకు సంబంధించిన షాకింగ్ కారణాన్ని వెల్లడించింది. తన భర్త, ప్రముఖ రాపర్ కెన్యే వెస్ట్‌తో విడిపోవడానికి గల కారణం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది అంబానీల పెళ్లిలో కిమ్, ఆమె సోదరి కోలే కర్దాషియన్ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకర్షించారు. అయితే, ఈ జంట విడాకుల ప్రక్రియ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కిమ్ చెప్పిన విడాకుల కారణం ఏమిటో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..
Also Read: Manchu Lakshmi: బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందు హాజరైన మంచు లక్ష్మి
కిమ్ కర్దాషియన్, కెన్యే వెస్ట్ విడాకులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కిమ్ తాజాగా వెల్లడించిన కారణం అందరినీ షాక్‌కు గురిచేసింది. కెన్యే అతిగా నిద్రపోవడం, ఎక్కడపడితే అక్కడ గురక పెట్టడం తనకు సమస్యగా మారిందని కిమ్ ఆరోపించింది. స్నేహితులతో సమావేశాల్లో, రెస్టారెంట్లలో కూడా కెన్యే నిద్రపోతాడని, ఇది తనకు అసౌకర్యంగా ఉందని తెలిపింది. అంబానీల పెళ్లిలో కిమ్ ఖరీదైన ఆభరణం కోల్పోవడం కూడా సంచలనం రేపింది.

