Elon musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అతనేం అమెరికా అధ్యక్షుడిగా అవుతారని అంచనా వేశారు. జేడీ వాన్స్ మంచి నాయకుడని ప్రశంసిస్తూ, ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
“అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ అత్యుత్తమంగా పని చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయనే అమెరికా అధ్యక్షుడు అవుతారు” అని మస్క్ ఒక పోస్టుకు స్పందిస్తూ రాశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో మస్క్ కీలకపాత్ర పోషించారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, టెస్లా అధినేత మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DoGE) ప్రభుత్వ వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకురావడానికి పలు కీలక విధానాలను అమలు చేస్తోంది.
తాజాగా, మస్క్ అమెరికా భవిష్యత్తు నాయకత్వంపై చేసిన ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగామారాయి.