Khammam

Khammam: సెల్పీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య..

Khammam: ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో విషాదం చోటుచేసుకుంది. ఢీ షోలో డాన్సర్ అభి కారణం అంటూ కావ్యకళ్యాణి అనే యువతి సూసైడ్ చేసుకుంది. తనని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరో యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు కావ్యకళ్యాణి సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది.

Also Read: Delhi Govt: ఈ వాహనాలకు నో పెట్రోల్, డీజిల్.. తేల్చిచెప్పిన ప్రభుత్వం

Khammam: ‘నేను చచ్చిపోబోతున్నాను.. నా చావుకి కారణం అభి.. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమించానని చెప్పి పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకెళ్లాడు.. ఇక ఇప్పుడు నన్ను వదిలేసి.. మరో అమ్మాయిని తీసుకొచ్చి.. నన్ను వెళ్లిపొమ్మన్నాడు..’ అంటూ యువతి సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది.

అయితే, ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Anil Ravipudi: సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *