West Bengal: పెళ్లికి ముందు ప్రతి ఒక్కరూ తనకు అందమైన, గుణవంతురాలైన యువతి భార్యగా రావాలని కోరుకుంటారు. అవసరాలు, అవకాశాలు, సంబంధ, బాంధవ్యాలు, గుణగణాలను బట్టి పెళ్లి కానిచ్చేసుకుంటారు. కానీ, కొందరికి అందమైన భార్య వరంలా దొరుకుతుంది. ఇక్కడా ఓ వ్యక్తికి అందమైన భార్య దొరికింది. ఆమె ముక్కుపై పెళ్లి నాటి నుంచే ఆయన మనసు పారేసుకున్నాడు. చివరికి ఆ ముక్కును ఏం జేసిండో తెలుసుకుందాం రండి.
West Bengal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా శాంతిపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బేర్పారాలో బాపన్ షేక్, మధు ఖాతూన్ భార్యాభర్తలు. మధు ఖాతూన్ అంటే ఆమె భర్తకు చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఆమె ముక్కు అంటే చెప్పలేనంత ఇష్టం, మక్కువ. అవకాశం చిక్కినప్పుడల్లా నీ ముక్కును కొరుక్కు తింటా.. అని తరచూ ఆమెతో అనేవాడంట.
West Bengal: భర్త మాటలను తేలికగా తీసుకున్నది మధు ఖాతూన్. జోక్ చేస్తున్నాడని ఆమె అనుకునేది. ఉన్నట్టుండి మొన్న అర్ధరాత్రి బాపన్ షేక్, మధు ఖాతూన్ ఇంటి నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. ఆ కేకలతో ఇరుగు పొరుగు నిద్ర నుంచి లేచి పరుగున ఆ ఇంటికి వచ్చాశారు. మధు ఖాతూన్ విలపిస్తూ బయటకు వచ్చింది. ఆమె ముక్కు నుంచి విపరీతంగా రక్తస్రావం కాసాగింది.
West Bengal: ఏం జరిగిందంటూ ఆ ఇరుగు పొరుగు ఆరా తీశారు. మధు ఖాతూన్ చెప్పిన సమాధానంతో అవాక్కవడం అక్కడికి చేరిన ఇరుగు పొరుగు వారి వంతయింది. ఎప్పుడూ ముక్కును కొరికేస్తాననే భర్త ఈ సారి ఏకంగా కొరికేశాడని చెప్పింది. ఇదేం పని అంటూ ఇరుగు పొరుగు ముక్కున వేలేసుకున్నారు. హద్దులు దాటిన ప్రేమో, అవధులే దాటిన పిచ్చో కానీ, ఆమె భర్త అన్నంత పనిచేసి ఆమెను ముక్కులేనిదాన్ని చేశాడు. ఈ ఘటనపై శాంతిపూర్ పోలీస్ స్టేషన్లో తన భర్తపై ఖాతూన్ ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తేలాలి మరి.

