Weather: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో వచ్చే కొన్ని రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఇక దక్షిణ ఝార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. మరోవైపు బికనీర్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం దాకా రుతుపవన ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి.
తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచుతున్నాయి. సముద్రం ప్రకంపించడంతో మత్స్యకారులకు వేటపై నిషేధం విధించారు. గత 24 గంటల్లో వేలేరుపాడులో 10 సెం.మీ, కూనవరంలో 9 సెం.మీ, కుకనూరులో 8 సెం.మీ, చింతూరులో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.