weather: తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురిసే అవకాశం ఉండగా, కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
సోమవారం (మే 19): వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మంగళవారం (మే 20): కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వాన పడే అవకాశం.
బుధవారం (మే 21): హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఉత్తర తెలంగాణలో వర్ష సూచనలు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 30–40 కిమీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది.
గత 24 గంటల్లో వర్షాలు
గడిచిన 24 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా నారాయణపేట జిల్లాలోని మక్తల్లో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది అని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) వెల్లడించింది.