Weather: మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా 11 రాష్ట్రాల్లో ఈరోజు కోల్డ్ వేవ్ అలర్ట్ ఉంది. ఈ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో టెంపరేచర్ 5° కంటే తక్కువగా ఉంది. రాజస్థాన్‌లో, గత 3 రోజులుగా సికార్, మౌంట్ అబూలో ఉష్ణోగ్రతలు 0° దగ్గరకు పడిపోయాయి.
ఐదు రోజులుగా మధ్యప్రదేశ్‌లో చలిగాలులు వీస్తున్నాయి. ఇప్పటికీ 25కి పైగా జిల్లాల్లో దీని ప్రభావం ఉంది. మరి కొన్ని రోజులు పరిస్థితి ఇలానే కొనసాగవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా మంచు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన కంగనా..
Weather: పంజాబ్‌లోని సంగ్రూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 1.1°C, హర్యానాలోని హిసార్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 1.7°C. నమోదైంది. గత 7 రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉష్ణోగ్రత మైనస్‌లో ఉంది. ఈరోజు శ్రీనగర్‌లో మైనస్ 3° నమోదైంది.దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబరు 15న రెండు చోట్లా వర్షం కురుస్తుంది.
Weather: పెరుగుతున్న చలి కారణంగా పశ్చిమ-ఉత్తర భారతదేశంలో 12.6 కి.మీ ఎత్తులో గంటకు 278 కి.మీ వేగంతో బలమైన చలి గాలులు వీస్తున్నాయి. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ యాక్టివ్‌గా ఉంది. దీనివల్ల మంచు కరుగుతోంది. దీంతో ఉత్తర, మధ్య భారత ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. పాక్‌లో వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా, జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లో నిరంతరం మంచు కురుస్తోంది.