Vijay Thalapathy: తమిళ సినీ రంగంలో 2026 సంక్రాంతి హోరాహోరీగా మారనుంది. విజయ్ తన చివరి చిత్రం ‘జన నాయగన్’తో పొంగల్ రేసులో దిగుతుండగా, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’, సూర్య ‘కరుప్పు’ చిత్రాలతో పోటీ పడనున్నారు. అయితే ‘కరుప్పు’ను మొదట ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకున్నా, సంక్రాంతికి వాయిదా పడింది. విజయ్ చిత్రానికి సోలో రిలీజ్ కావాలని అభిమానులు కోరుతున్నారు. కానీ, సూర్య సినిమా రిలీజ్‌తో థియేటర్లు, ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సూర్యపై విమర్శలు, వార్నింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. విజయ్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సినీ యుద్ధం ఎలా ముగుస్తుందో చూడాలి!
