War 2: తారక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వార్ 2 గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు
‘వార్ 2’ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉన్నానని హృతిక్ ఓ లాంగ్ పోస్ట్ చేశాడు.
149 రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్ లో.. ఛేజ్, యాక్షన్, డాన్స్, బ్లడ్, స్వెట్, ఇంజూరీస్.. ఇలా అన్నింటినీ ఆస్వాదించానని, అవన్నీ కూడా వర్త్ వాచింగ్ మూవీకి దారి తీశాయని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాని, తామిద్దరూ కలిసి వర్క్ చేయడం సమ్ థింగ్ స్పెషల్ అని, ఈ సినిమాలో కియారా అద్వానీలోని మరో కోణాన్ని ఆడియన్స్ చూస్తారని, సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు అయాన్ ముఖర్జీని హృతిక్ పొగడ్తలతో ముంచెత్తుతూ.. టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాడు..తాను పోషించిన కబీర్ పాత్రను వీడి వెళ్ళడమనేది తనకు ఓ తీయని బాధను కలిగిస్తుందని, మళ్ళీ మామూలు మనిషి కావడానికి కొద్ది రోజుల సమయం పడుతుందని పొయెటిగ్ గా పోస్ట్ పెట్టాడు.
ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది వార్ 2.

