War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జోడీతో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై అభిమానుల్లో ఉత్సాహం నింపింది. పఠాన్, టైగర్ సినిమాలతో లింక్ అయ్యే ఈ మూవీలో రెండు పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నట్లు సమాచారం. ఇవి పఠాన్ 2, అలాగే స్పై యూనివర్స్‌లోని తొలి మహిళా ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రం ఆల్ఫాకు సంబంధించినవని తెలుస్తోంది. గతంలో పఠాన్, టైగర్ 3లోని పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఫ్యాన్స్‌ను ఆకర్షించినట్లే, ఈ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. ఈ సీన్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో, ఎంతవరకు స్పై యూనివర్స్‌ను ముందుకు తీసుకెళ్తాయో చూడాలి.
