Vishal Marriage: కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సికల పెళ్లి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్ 29న పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పెళ్లి మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది.
నడిగర్ సంఘం భవనమే కారణం
తాజాగా ఓ ఈవెంట్‌లో విశాల్ మాట్లాడుతూ, “తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తవ్వడానికి ఎదురుచూస్తున్నాను. ఆ భవనంలోనే మా పెళ్లి జరగాలి. అది నా కల. నడిగర్ సంఘం భవనంలో జరగబోయే మొదటి పెళ్లి నాదే అవుతుంది. ఇప్పటికే పెళ్లి మందిరం బుకింగ్ కూడా చేశాం. ఇంకా రెండు నెలలు ఆగలేనా?” అని అన్నారు.
ఇది కూడా చదవండి: Telangana: రాత్రి వేళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం.. నేరుగా పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు
2017లో ప్రారంభమైన నడిగర్ సంఘం భవన నిర్మాణం పలు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ప్రస్తుతం భవనం మూడో అంతస్తులో పెళ్లి మందిరం నిర్మాణం జరుగుతోంది. భవనం పూర్తయ్యే వరకు పెళ్లి వాయిదా పడుతుందన్న ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.
రెండు గుడ్ న్యూస్‌లు రాబోతున్నాయ్
ఆగస్ట్ 29 విశాల్ పుట్టినరోజు. అదే రోజు ఆయన రెండు గుడ్ న్యూస్‌లు చెప్పబోతున్నారని సమాచారం. ఒకటి – నడిగర్ సంఘం భవన ప్రారంభోత్సవం, రెండోది – పెళ్లి కొత్త తేదీ అని అభిమానులు ఊహిస్తున్నారు.
ప్రేమ, పెళ్లి కథ
విశాల్ గతంలో హీరోయిన్ అనీషాతో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందు విడిపోయారు. ఆ తర్వాత సాయి ధన్సికతో ప్రేమలో పడ్డారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో అధికారికంగా పెళ్లి విషయాన్ని ప్రకటించారు.
సినిమాల విషయానికి వస్తే
విశాల్ ఇటీవల “మదగజరాజ” సినిమాలో నటించారు. ప్రస్తుతం “తుప్పరివాలన్ 2” మూవీ షూటింగ్‌లో ఉన్నారు. సాయి ధన్సిక రజినీకాంత్ “కబాలి” ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తెలుగులో “అంతిమ తీర్పు”, “షికారు” వంటి సినిమాల్లో నటించారు.