DPL 2025: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2025) 2వ ఎడిషన్ వేలం ప్రక్రియ ముగిసింది, భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు కుమారులలో ఒకరికి తీపి అనుభవం ఎదురు కాగా మరొకరికి చేదు అనుభవం ఎదురైంది. సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్ మరియు వేదాంత్ సెహ్వాగ్ ఇద్దరూ ఢిల్లీ జూనియర్ క్రికెట్‌లో ఆడారు. అయితే2025 ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆర్యవీర్‌కు మంచి అవకాశం లభించినప్పటికీ, ఏ జట్టు కూడా అతని కోసం బిడ్ చేయకపోవడంతో వేదాంత్ అమ్ముడుపోలేదు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఆర్యవీర్‌ను రూ.8 లక్షలకు కొనుగోలు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్-19 జట్టు తరపున ఆడుతున్నాడు. తన బ్యాటింగ్ నైపుణ్యాలతో అతను అందరి దృష్టిని ఆకర్షించాడు.
2024లో, మేఘాలయపై ఢిల్లీ తరపున ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్న ఆర్యవీర్ 297 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ సిమర్జీత్ సింగ్ ఐపీఎల్ 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతన్ని రూ.39 లక్షలకు కొనుగోలు చేసింది. సిమర్జీత్ ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భాగంగా ఉన్నాడు. అంతకు ముందు అతను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తరపున కూడా ఆడాడు. గత దేశీయ సీజన్‌లో ఢిల్లీ జట్టును విడిచిపెట్టి ఈసారి తన స్వస్థలానికి తిరిగి వచ్చిన నితీష్ రనార్‌ను వెస్ట్ ఢిల్లీ లయన్స్ రూ.34 లక్షలకు కొనుగోలు చేసింది. అనుభవజ్ఞుడైన ఇషాంత్ శర్మ కూడా వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టులో రూ.13 లక్షలకు చేరాడు. విరాట్ కోహ్లీ అన్నయ్య కొడుకు కూడా వేలంలో అమ్ముడయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతనిపేరు కూడా ఆర్యవీర్ కావడం.
ఇది కూడా చదవండి:
WTC Points Table: WTC ఖాతా తెరిచిన భారత్.. పాయింట్ల పట్టిక ఎలా ఉందో చూడండి !
Yash Dayal: బిగ్ షాక్ .. ఆర్సీబీ బౌలర్ యశ్ దయాళ్‌పై కేసు నమోదు!

