Virat Kohli: ఐపీఎల్ ఈ సీజన్లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉనాడు. ఇప్పటివరకు అతను 11 ఇన్నింగ్స్‌లలో 63.13 సగటుతో 505 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.. ఆర్సీబీ ప్రస్తుతం సీజన్లో మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లను గెలిచి టాప్-2 స్థానాన్ని దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. అయితే కోహ్లీని ఓ రికార్డ్ ఊరిస్తుంది. ఇంకా కొన్ని రన్స్ చేస్తే కోహ్లీ ఓ కొత్త రికార్డ్ నెలకొల్పనున్నాడు.
విరాట్ కోహ్లీ 2008 నుండి ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌లో కూడా ఆ జట్టు తరపున ఆడాడు. ఇప్పటివరకు ఆర్సీబీ తరఫున కోహ్లీ 278 టీ20 మ్యాచ్‌లు ఆడి 39.52 సగటుతో 8933 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వచ్చే మ్యాచుల్లో మరో 67 పరుగులు చేయగలిగితే.. టీ20 క్రికెట్ చరిత్రలో 9000 రన్స్ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించనున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ జట్లు లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బెంగళూరు జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లను హైదరాబాద్, లక్నోతో ఆడుతుంది. పంజాబ్.. ఢిల్లీ, ముంబైలను ఎదుర్కోవలసి ఉంది. ఈ రెండు జట్లు తమ మిగిలిన మ్యాచ్‌లను గెలిస్తే..21-21 పాయింట్లతో లీగ్ దశలో టాప్-2లో ఉంటాయి. మరోవైపు ముంబై జట్టు గరిష్టంగా 18 పాయింట్లను మాత్రమే చేరుకోగలదు. ఆర్సీబీ అగ్రస్థానంలో కొనసాగితే, వారు ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.