Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగులు సాధించడమే ఆలస్యం కానీ అతను చేసే ప్రతి రన్ తో ఒక రికార్డు ముడిపడి ఉంటుంది. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో 52 పరుగులతో మెరిసిన కోహ్లీ ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌పై 4000 పరుగులు సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా అతను నిలిచాడు. ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో కలిపి 4000కు పైగా పరుగులు చేసిన కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డును 3990 పరుగులను అధిగమించాడు.
ఇప్పటికే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలపై 3000 పైగా పరుగులు సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా కూడా కోహ్లీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరు పైన ఉన్న మరో రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టు పై నాలుగు వేల పరుగులు సాధించిన మొట్టమొదటి భారత్ ప్లేయర్ గా కోహ్లీ నిలవడం గమనార్హం.
ఆస్ట్రేలియాపై 5000 ప్లస్ రన్స్ చేసిన కోహ్లీ, ఇంగ్లండ్‌పై 4000 ప్లస్ రన్స్, సౌతాఫ్రికాపై 3000 ప్లస్ రన్స్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు దేశాలపై 4000 ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్‌గా కోహ్లీ… రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు. కోహ్లీ, పాంటింగ్ ఇద్దరూ మూడు దేశాలపై 4000 ప్లస్ రన్స్ చేయగా, సచిన్ రెండు దేశాలపై ఈ ఘనతను సాధించాడు.
ఇది కూడా చదవండి: Viral News: వరదల్లో నీరు వచ్చి చేరుతోందని ఇంటిని వంద అడుగులు వెనక్కి జరుపుతున్నారు!
Virat Kohli: ఆసియా గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా 16,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఈ సాధనతో సచిన్ రికార్డును 353 ఇన్నింగ్స్‌లో సాధించిన ఘనతను కోహ్లీ 340 ఇన్నింగ్స్‌లోనే మించిపోయాడు. పైగా కోహ్లీ ఇందులో t20 లు కూడా ఆడడం విశేషం.
అయితే నిన్ను విరాట్ కోహ్లీ అర్థ శతకం సాధించినప్పటికీ మునుపటిలా అతను ఆత్మవిశ్వాసంగా బౌండరీలను కొట్టలేకపోయాడు. మరియు ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ లో తడబడిన కోహ్లీ వన్డే ఐదవ సారి ఆది రషీద్ కే తన వికెట్ ఇవ్వడం అనేది నిజంగా భారత అభిమానులను కలవరపరిచే విషయమే. వయసు ఎక్కువ అవుతున్న కారణం కావచ్చు ఏమో… కోహ్లీ బ్యాటింగ్ అప్పటిలాగా స్పిన్ బౌలింగ్ లెంగ్త్ ను అతను అంచనా వేయలేకున్నాడు. ఇలా ఉంటే దుబాయ్ పిచ్ ల పైన కోహ్లీ మరింత తడబడే అవకాశం ఉంది.