Champions Trophy 2025

Champions Trophy 2025: ఒక్క సెంచరీతో విశ్వ రికార్డులు బద్దలు కొట్టిన విరాట్!

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 5వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అది కూడా బద్ధ శత్రువైన పాకిస్తాన్ పై. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 42.3 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ భారీ విజయం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో 3వ స్థానంలో మైదానంలోకి వచ్చిన కోహ్లీ, పాకిస్తాన్ బౌలర్లను ఒక ఆట ఆదుకున్నాడు. 111 బంతుల్లోనే తన సెంచరీని చేరుకున్నాడు. ఈ సెంచరీతో, ఈ రికార్డు హోల్డర్ తన పేరు మీద మరిన్ని రికార్డులను సృష్టించాడు. కింగ్ కోహ్లీ చేసిన ఒక్క శతకం అతనికి ఎన్నో రికార్డులను మూటగట్టి అందించింది. అవేమిటో తెలుసుకుందాం..

వేగంగా 14 వేల పరుగులు: ఈ మ్యాచ్‌లో తన సెంచరీతో, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేశాడు. అది కూడా కేవలం 287 ఇన్నింగ్స్‌లలో. దీంతో వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు: ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. గతంలో 23 యాభై-ప్లస్ స్కోర్లు చేసిన సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు, ఈ రికార్డును సమం చేయడం ద్వారా కింగ్ కోహ్లీ అగ్రస్థానానికి ఎదిగాడు.

Also Read: Kabaddi: అయ్యో.. పాపం! కబడ్డీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన టీచర్

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. దీనితో, అతను ICC టోర్నమెంట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన ఆటగాడిగా నిలిచాడు. కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 14 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.

వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు: వన్డే క్రికెట్‌లో 50+ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. గతంలో 50 సెంచరీలతో ప్రపంచ రికార్డు సృష్టించిన కింగ్ కోహ్లీ, ఇప్పుడు తన 51వ సెంచరీతో చారిత్రాత్మక ఘనతను సాధించాడు.

రన్ మెషిన్: పాకిస్థాన్‌పై తన సెంచరీతో, వన్డే క్రికెట్‌లో 14,000 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ప్రపంచంలోనే మూడవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (18426), కుమార్ సంగక్కర (14234) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

బెస్ట్ ఫీల్డర్: విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు కూడా పట్టాడు. దీనితో, అతను భారతదేశం తరపున వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు మహ్మద్ అజారుద్దీన్ (156) పేరిట ఉంది. కింగ్ కోహ్లీ ఇప్పుడు 158 క్యాచ్‌లతో అత్యుత్తమ ఫీల్డర్ గా అవతరించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *