Viral Video: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గం కుప్పంలో కృష్ణా జలాలతో ఒక అద్భుతమైన కళాఖండం ఆవిష్కృతమైంది. స్థానిక కళాకారుడు పురుషోత్తం, హంద్రీనీవా కాలువలో పారుతున్న కృష్ణా జలాలకు రంగులు కలిపి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రాన్ని గీశారు. ఈ అపురూపమైన చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పురుషోత్తం అనే కళాకారుడు కుప్పం ప్రాంతానికి చెందినవారు. ఆయన కృష్ణా జలాలను ఉపయోగించి ఈ చిత్రాన్ని రూపొందించి తన అభిమానాన్ని, సంతోషాన్ని వినూత్నంగా చాటుకున్నారు. హంద్రీనీవా కాలువ వద్ద ఈ చిత్రాన్ని గీసి ఆయన చాలామంది ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆయన గీసిన చిత్రం, కృష్ణా జలాలు తమ ప్రాంతానికి రావడం పట్ల ప్రజల్లో ఉన్న ఆనందానికి ప్రతీకగా నిలిచింది. పురుషోత్తం గీసిన ఈ చిత్రం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. నెటిజన్లు కళాకారుడి సృజనాత్మకతను, ముఖ్యమంత్రిపై ఆయనకు ఉన్న అభిమానాన్ని ప్రశంసిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో కృష్ణా జలాలతో సీఎం @ncbn చిత్రాన్ని కుప్పం కళాకారుడు పురుషోత్తం అద్భుతంగా ఆవిష్కరించారు..
హంద్రీనీవా కాలువ పక్కన కృష్ణా జలాలకు రంగులు కలిపి బాబు ఈ చిత్రాన్ని గీశారు. కృష్ణా జలాలతో గీసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..#chitoor #krishna… pic.twitter.com/C4XqNP7oB1
— Telugu Stride (@TeluguStride) August 29, 2025