Viral News: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాక్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పాక్‌పై ఎన్నో ఆంక్షలు విధించింది. అటు సినిమా ఇండస్ట్రీ సైతం పాక్ నటులను నిషేధించింది. అదేవిధంగా సింధు నది జలాల ఒప్పందం నుంచి సైతం వైదొలిగింది. ఇటువంటి తరుణంలో నెట్టింట వీడియో వైరల్‌గా మారింది. పాక్ నటి హనియా అమీర్‌కు మనవాళ్లు వాటర్ బాటిళ్లు పంపినట్టుగా అందులో ఉంది.
హనియా పాకిస్థాన్‌లో ప్రముఖ నటి. ఆమెకు మన దేశంలోనూ అభిమానులు ఉన్నారు. ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్‌తో కలిసి సర్దార్జీ-3లో ఆమె నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఇరుదేశాల ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పహల్గాం దాడితో అది కుదరకపోవచ్చు. ఇప్పటికే పాక్ నటించిన సినిమాలను బ్యాన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అటువంటిది ఆమెను కొత్త సినిమాల్లో తీసుకునే సాహసం మనవాళ్లు చెయ్యరు.
Also Read: Viral News: ప్రియురాలి కాళ్లు మొక్కిన ప్రియుడు.. ఆనందంతో డాన్స్ చేసిన యువతీ
Viral News: ఈ క్రమంలో భారత్‌లోని ఆమె ఫ్యాన్స్ ఒక బాక్స్ నిండా నీరు నింపిన బాటిళ్లను పంపినట్లు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరలువుతన్నాయి. కొందరు యువకులు ఆ కార్టన్‌ను ప్యాక్ చేస్తున్నట్టుగా ఉండగా.. భారత్ నుంచి హనియాకు అనే క్యాప్షన్ ఆ బాక్స్‌పై ఉంది. అయితే దీనిపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త సమయంలో మీమ్స్ క్రియేట్ చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది కేవలం ఒక మీమ్ మాత్రమేనని.. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటివి చేస్తుంటారని విమర్శిస్తున్నారు.
View this post on Instagram

