Viral News: పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆ తర్వాతి పరిణామాలపై దేశవ్యాప్తంగా కొందరు బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆర్మీ ఉన్నతాధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలను మరువక ముందే అదే పార్టీకి చెందిన హర్యానా ఎంపీ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేపాయి.
Viral News: పహల్గాం దాడిలో మహిళలకు ధైర్యం లేకనే తమ భర్తలను కోల్పోయారని, శిక్షణ లేకనే పర్యాటకులు చేతులు ముడుచుకొని కూర్చొని చనిపోయారు.. అంటూ బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా వ్యాఖ్యానించారు. పహల్గాం దాడిలో చనిపోయిన వారు ప్రధాని మోదీ మొదలుపెట్టిన అగ్నివీర్ పథకంలో శిక్షణ తీసుకొని ఉంటే చనిపోయే వారు కాదని పేర్కొన్నారు. అక్కడున్న మహిళలకు కొంచెం ధైర్యం ఉన్నా వారు తమ భర్తలను కాపాడుకునేవారని ఆ ఎంపీ వ్యాఖ్యానించారు.
Viral News: సరైన ఆయుధాలు, శిక్షణ లేకనే పర్యాటకులు చేతులు ముడుచుకొని ఉగ్రవాదుల బుల్లెట్లకు తలొంచి మృత్యువాత పడ్డారని బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా ఆరోపించారు. చేతులు జోడించి ప్రార్థిస్తే ఉగ్రవాదులు వినేరకం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.