Jana Nayagan: తలపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ గురించి తాజా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రాజకీయ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. విజయ్ సినీ కెరీర్‌లో ఇది చివరి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ ఒక ధీరోదాత్తమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి స్టార్ కాస్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా తాజా అప్డేట్ సెప్టెంబర్ 5న, దర్శకుడు హెచ్. వినోద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుందని సమాచారం.గతంలో విజయ్ పుట్టినరోజున విడుదలైన ఫస్ట్ రోర్ టీజర్ 32.4 మిలియన్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఇప్పుడు సెప్టెంబర్ 5న వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
