Jai Hanuman

Jai Hanuman: జై హనుమాన్ నుంచి స్పెషల్ ట్రీట్?

Jai Hanuman: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న జై హనుమాన్ సినిమా నుంచి జులై 7న రిషబ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ట్రీట్ రానుంది. మేకర్స్ ఈ సందర్భంగా వీడియో గ్లింప్స్ లేదా టీజర్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టి-సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తేజ సజ్జా కూడా నటిస్తున్నట్లు గతంలో వెల్లడైంది.

Also Read: OG Makers: అభిమానులకి OG మేకర్స్ భరోసా!

Jai Hanuman: హను మాన్ సినిమా 40 కోట్ల బడ్జెట్‌తో భారీ వసూళ్లు సాధించగా, దాని సీక్వెల్‌గా వస్తున్న జై హనుమాన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం హనుమంతుడి గొప్పతనాన్ని చాటనుంది. 2025లో రిలీజ్ అని చెప్పినప్పటికీ, రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 పనుల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. అక్టోబర్ 2న కాంతార: చాప్టర్ 1 రిలీజ్ తర్వాత జై హనుమాన్‌పై ఆయన ఫోకస్ పెరగనుంది. రిషబ్ ఈ చిత్రంతో అన్ని భాషల ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maria Sharapova: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో షరపోవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *