Jacqueline Fernandez: హీరోయిన్ గా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కెరీర్ ఒడిదొడుకులతో సాగుతోంది. రేస్ 3 తర్వాత ఆమెకు పెద్దగా హిట్స్ లేవు. హీరోయిన్‌గా రాణిస్తున్నా సక్సెస్ మాత్రం దూరమైంది. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు ఆమెకు తలనొప్పిగా మారి, ఆఫర్లు కూడా తగ్గాయి. రామ్ సేతు, సర్కస్ సినిమాలు ఫ్లాప్ కాగా, ఇమ్మి ఇమ్మి సాంగ్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఫతె, హౌస్‌ఫుల్ 5లో నటించినా ఫలితం లేకపోయింది. అయితే ఐటమ్ సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెను ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది టిక్ టిక్, దమ్ దమ్ సాంగ్స్‌తో క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల కంటే ఆల్బమ్స్‌తో ఆఫర్లు పెంచుకుంటున్న జాక్వెలిన్, ప్రస్తుతం వెల్కమ్ టు ది జంగిల్ సినిమా మాత్రమే చేస్తుంది. అయితే ఈ మల్టీస్టారర్ రిలీజ్‌పై సస్పెన్స్ నడుస్తుంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మున్ముందు మరిన్ని స్పెషల్ సాంగ్స్‌తో రాణిస్తుందేమో చూడాలి.
