Vijay Sethupathi: తాజాగా ఓ ఛానల్ పాన్ఇండియా యాక్టర్స్ రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో టాలీవుడ్ కి చెందిన సిద్దూ జొన్నలగడ్డ, ప్రకాశ్ రాజ్, కోలీవుడ్ కి చెందిన అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, మల్లూవుడ్ నుంచి ఉన్ని ముకుందన్, బాలీవుడ్ నుంచి విజయ్ వర్మ పాల్గొన్నారు. ఆర్టిస్ట్ ల అనుభవాలు, సమస్యలు, ఆడిషన్స్ గురించి జరిగిన చర్చలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ బయటపడింది. వీరిద్దరూ మంచి స్నేహితులట. ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇద్దరూ ఓ చోట చేరి కబుర్లు ఆడేసుకుంటారట. ఇక ఈ ప్రోగ్రామ్ లో విజయ్ సేతుపతి సీరియస్ గా మాట్లాడుతుంటే అరవింద్ స్వామి సిల్లీ చేసేశాడు. అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్ నటన అంటే ఇష్టమని, వాళ్లలా చేయగలనా అని ఫీలవుతుంటానని అంటున్నపుడు వారిద్దరూ కలసి సేతుపతిని ఆటపట్టించేశారు. దాంతో అరవింద్ స్వామిని బయటకు పంపేయాలని, ఇంటర్వ్యూని చెడగొడుతున్నాడని కంప్లైట్ చేశాడు విజయ్ సేతుపతి. సేతుపతినే కాదు విజయ్ వర్మని, ఉన్ని ముకుందన్ ని ఆట పట్టించేశాడు అరవింద్ స్వామి. దాంతో స్టార్స్ పై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ పెట్టేస్తున్నారు.