Vijay Rupani: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. గుర్తించిన మృతదేహం డీఎన్ఏతో కుటుంబ సభ్యుల డీఎన్ఏ సరిపోలిందని వైద్యులు నిర్ధారించారు. దీనిని ఆ రాష్ట్ర హోంమంత్రి ధ్రువీకరించారు. ఆయన మృతితో ఇప్పటికీ కుటుంబ సభ్యులు తేరుకోలేకపోయారు.
Vijay Rupani: ఆసుపత్రి వైద్యులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని అప్పగించనున్నారు. ఈ మేరకు ఆయన అంత్యక్రియలు రాజ్‌కోట్‌లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ నెల 12న జరిగిన విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మృతి చెందారు. ఆయన మృతితో ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.