Vijay Deverakonda: గుర్తింపు లేని చిన్నా చితకా వేషాలతో కెరీర్ స్టార్ట్ చేసి.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో క్రేజీ అండ్ సాలిడ్ స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు విజయ్.. ఆన్ స్ర్కీన్ సంగతి పక్కన పెడితే.. ఆఫ్ స్క్రీన్ లో విచిత్రం ఏంటంటే.. కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు మనోడు. వివాదం ఉన్న చోట విజయ్ ఉంటాడా లేక విజయ్ ఉన్న చోటే వివాదం ఉంటుందా అంటే చెప్పలేం.. ఈ మధ్య సరైన సినిమా పడలేదు. కింగ్ డమ్ మీదనే హోప్స్ పెట్టుకున్నాడు.
ఇంతలో రెట్రో ఫంక్షన్ లో ట్రైబల్ అనే పదం వాడినందుకు కేసు, బెట్టింగ్ యాప్స్ కేసులో మరో ట్విస్టు.. ఇలాంటి కాంట్రవర్సీలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతలో.. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చెయ్యాల్సిన మూవీని జూలై 10న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి, డూరెక్ట్ గా షూటింగ్ కి వెళ్లిపోవాలని అనుకున్నారు. కట్ చేస్తే, అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఒకవేళ ఈడీ కేసులో విజయ్ విచారణకు హాజరవ్వడానికే మూవీ పూజ వాయిదా వేశారేమో అనే టాక్ అయితే వినిపిస్తోంది.

