Vijay Deverakonda: సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వెళ్లిన విజయ్ దేవరకొండ.. అక్కడ మెట్ల మీద నుంచి జారిపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొందరు ఈ వీడియోపై ట్రోల్స్ కూడా మొదలుపెట్టారు. దీనిపై రియాక్ట్ అయిన వీడీ ట్రోలర్స్ కు సూపర్ పంచ్ ఇచ్చాడు. బ్రాండ్ దుస్తుల ప్రమోషన్స్ కు వాడుకున్నాడు. ప్రమాదవశాత్తు తనకు జరిగిన ఘటనకు సంబంధించిన ఓ వీడియోకు మరో వీడియోను కలిపి ఎడిట్ చేశాడు. ఆ వీడియోను కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్ ప్రేమలో పడుతూనే ఉంటాం. తప్పకుండా మీరు కూడా రౌడీ వేర్ తో ప్రేమలో పడతారు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో విజయ్ తెలివికి నెటిజన్లు సూపర్ అంటున్నారు. కొందరైతే బిజినెస్ బ్రాండ్ పేరు చెబుతూ అన్నీ రౌడీ ఆలోచనలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Vijay Deverakonda: ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా రౌడీ పేరుతో దుస్తుల బ్రాండ్ ను వీడీ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరో అయ్యాడు. ఈ రౌడీ హీరో ఎంత సక్సెస్ చూసాడో అంత కంటే ఎక్కువ ఫెయిల్యూర్ చూసాడు.