samantha

samantha: షూట్‌లో బాగా ఏడ్చేశా.. సమంత ఆసక్తికర కామెంట్స్‌

samantha: వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో రీసెంట్ గా రిలీజైన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం నెట్టింట సిటాడెల్ వెబ్ సిరీస్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. తాజాగా ఓ ఈవెంట్ కి వెళ్లిన సమంత సిటాడెల్ సిరీస్ సక్సెస్ పై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

‘ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. అందుకే సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలు నేను చేయను. ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకూడదు. వారు అన్ని విషయాలను గమనిస్తారు. అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాలి. నేను ఒక విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపై ఉంటుంది. అందుకే ఎన్నో విషయాల గురించి ఆలోచించి, పాత్రలను ఎంచుకుంటాను.

samantha: ప్రస్తుతం సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. ‘సిటాడెల్: హనీ బన్నీ’లో నటించడం నాకు సవాల్గా అనిపించింది. హీరోకు సమానమైన పాత్ర నాది. యాక్షన్స్ సన్నివేశాల్లోనూ హీరోతో సమానంగా చేశా, కానీ, ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చాన్స్ల కోసం నటీమణులు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ, నాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినా అందులో కూడా కొన్నింటినే ఎంచుకుంటున్నాను. నాకు వచ్చిన ఆఫర్లకు, నేను చేసిన సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది” అని సమంత పేర్కొన్నారు.

ఇక బాలీవుడ్‌ దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకేను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు నటి సమంత . వారితో వర్క్‌ చేయడం ఎంతో కష్టంగా ఉంటుందన్నారు. తమ కాంబోలో వచ్చిన తొలి ప్రాజెక్ట్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ షూట్‌ రోజులను గుర్తుచేసుకున్నారు. షూట్‌లో తాను బాగా ఏడ్చేశానని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TATA Trust Chairman: టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *